వరంగల్/ మే 8(జర్నలిస్ట్ వార్త): దళిత క్రైస్తవుల సామాజిక, రాజకీయ హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని దళిత రత్న అవార్డు గ్రహీత, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత క్రైస్తవుల అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా మహేందర్ మాదిగ మాట్లాడుతూ దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఫలాలను అందించాలని కోరారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి క్రైస్తవ మిషనరీలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
సమాజంలో దళిత క్రైస్తవుల స్థితిగతులు, విద్య, ఉద్యోగ అవకాశాల మెరుగుదలపై ఈ సదస్సులో సుదీర్ఘంగా చర్చించారు. హక్కుల సాధనలో భాగంగా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని నాయకులు నిర్ణయించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రతినిధులను సొసైటీ సభ్యులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో