వర్ధన్నపేట/జూలై 28(జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట మండలం బండౌ వుతపురం గ్రామానికి చెందిన ఓ 4 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు, అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటికాయల భాస్కర్ (50)పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, జూలై 26న బాలిక ఆడుకుంటూ నిందితుడి ఇంట్లోకి వెళ్లగా, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చిన్నారి తెలిపిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
బాలికపై లైంగిక వేధింపుల యత్నం ఆరోపణ.. ప్రధానోపాధ్యాయుడు రిమాండ్‌కు
By -
July 28, 2026