బస్సు కింద పడి విద్యార్థి మృతి

journalist vaartha
By -
నెక్కొండ/అక్టోబర్ 7(జర్నలిస్ట్ వార్త);
వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యోదయ హైస్కూల్‌కు చెందిన బస్సు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. బస్సు విద్యార్థిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఘటనతో తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.