దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎస్సై అనిల్ కుమార్

journalist vaartha
By -
గీసుకొండ/అక్టోబర్ 20 (జర్నలిస్ట్ వార్త):

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గీసుకొండలో ఎస్సై అనిల్ కుమార్ దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి, హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఎస్సై అనిల్ కుమార్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, న్యాయం మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ప్రజలంతా పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.