విజయవాడ/జనవరి19 (జర్నలిస్ట్ వార్త):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని ఎన్‌ఏసీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన 1989 ఎస్సై బ్యాచ్ రీయూనియన్ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బ్యాచ్‌లో మృతి చెందిన పోలీస్ అధికారులకు పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటిస్తూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం 5వ పోలీస్ బెటాలియన్‌లో శిక్షణ పొందిన రోజుల్ని స్మరించుకుంటూ అప్పటి అనుభవాలు, మధుర జ్ఞాపకాలను సహచరులతో పంచుకున్నారు. కార్యక్రమంలో సహచరులతో ఆత్మీయంగా మమేకమై ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సందడి చేశారు.1989 ఎస్సై బ్యాచ్‌లో ఎస్‌ఐ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగి, కమిషనర్ హోదాలో పదవీ విరమణ చేసిన అనంతరం ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి, ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిగా కె.ఆర్. నాగరాజు పోలీస్ శాఖకే కాదు, మొత్తం 1989 బ్యాచ్‌కు గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. ఆయన ప్రయాణం యువ పోలీస్ అధికారులకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.