సత్తుపల్లి/జనవరి17(జర్నలిస్ట్ వార్త):
సత్తుపల్లి మున్సిపాలిటీ మొత్తం 23వా
ర్డులకు రిజర్వేషన్లు ఖరారైనవి. రిజర్వేషన్ వారీగా ఎస్టి జనరల్ కు 9 వ వార్డు కేటాయించారు. ఎస్సీ జనరల్ కు 10,16 వార్డులు, ఎస్సీ మహిళ కు 12 వ వార్డు, బీసీ జనరల్ కు 4,5,15,20 వార్డులు, బీసీ మహిళ 13,22,23 వార్డులు కేటాయించారు. జనరల్ మహిళ కు 2,3,6,7,17,18,19 వార్డులు, అన్ రిజర్వుడు గా 1,8,11,14,21 వార్డులు కేటాయించారు.
ఖమ్మం,భద్రాద్రి మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఈ విధంగా...!
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ చైర్మన్ల రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేసారు.కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ గా, ఖమ్మం కార్పొరేషన్ జనరల్ మహిళ,అశ్వారావుపేట మున్సిపాలిటీ జనరల్ మహిళ, ఇల్లెందు బీసీ మహిళ,కల్లూరు ఎస్టీ జనరల్,మధిర జనరల్ మహిళ,వైరా మున్సిపాలిటీ జనరల్ మహిళ,సత్తుపల్లి మున్సిపాలిటీ జనరల్ మహిళ, ఎదులపురం ఎస్సీ మహిళ కు కేటాయించారు. ఈ సారి చైర్మన్ల గా ఎక్కువ మంది మహిళ లే ఉండటం విశేషం.
