సీఎం కప్ క్రీడల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి

journalist vaartha
By -



భీమదేవరపల్లి ఎంపీడీవో వీరేశం 

భీమదేవరపల్లి/జనవరి17 (జర్నలిస్ట్ వార్త): రాష్ట్రంలో సీఎం కప్ 2025 క్రీడలు జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు శనివారం భీమదేవరపల్లి ఎంపీడీవో వీరేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడలలో పాల్గొనే గ్రామీణా క్రీడాకారులు వారి వారి విభాగాలలో,గ్రామ పంచాయితీ, మండల, నియోజక వర్గం, జిల్లా స్థాయిలో పాల్గొనే అభ్యర్థులు తమ పేర్లను నమోదు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం రోజు నుంచి మొదలైనట్లు తెలిపారు. ఉత్సాహవంతులైన క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, ఫోటోతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులో ఉందని తెలియజేసారు..