హనుమకొండ/జనవరి18(జర్నలిస్ట్ వార్త): సీపీఐ శతవసంతాల సందర్భంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ, ప్రదర్శనకు హనుమకొండ జిల్లా నుండి సీపీఐ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఖమ్మంలో జరిగిన జనసేవాదల్ కవాతులో సైతం జిల్లా నుండి వందలాదిమంది యువ కమ్యూనిస్టు కార్యకర్తలు తరలివెళ్ళారు. జిల్లాలోని ఆయా మండలాలు, ప్రాంతాల నుండి బస్సులు, ఇతర వాహనాల ద్వారా తరలి వెళ్లి ఖమ్మం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తొలుత జనసేవాదల్ వాలంటీర్ల వాహనాలను ఎర్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి తరలి వెళ్లిన నాయకులలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్,మండ సదా లక్ష్మి, జిల్లా నాయకులు మోతె లింగారెడ్డి, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, అశోక్ స్టాలిన్, యేషబోయిన శ్రీనివాస్, బాషబోయిన సంతోష్, ఏదునూరి వెంకట్రాజం, బత్తిని సదానందం, మునిగాల బిక్షపతి, నేదునూరి రాజమౌళి, నకీర్త ఓదెలు, కొట్టెపాక రవి, వేల్పుల సారంగపాణి, యాళ్ల సంజయ్, రాజ్ కుమార్, గుంటి రాజేందర్, దీనా, మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి, మాలోతు శంకర్, సదానందం,మర్రి శ్రీనివాస్, లలిత,మంగ,స్వరూప,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం సభకు తరలిన సీపీఐ శ్రేణులుభారీగా తరలివెళ్ళిన కార్యకర్తలు
By -
January 18, 2026