ఉత్తమ అవార్డు అందుకున్న బూరుగు రవి గౌడ్

journalist vaartha
By -


స్టేషన్ ఘన్ పూర్/జనవరి18 (జర్నలిస్ట్ వార్త); 
జనగామ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యం లో రాష్ట్ర కళాకారుడు,జనగామ జిల్లా కళా వేదిక అధ్యక్షుడు, మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన బూరుగు రవి గౌడ్ ను ఆదివారం రోజున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘనంగా సన్మానించా రు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ జేఏసీ ఆత్మీయ సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ సైనికుడు డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్, బీసీ జేఏసీ చైర్మన్ చేవెళ్ల సంపత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకు లు కళాకారుడు బూరుగు రవి గౌడ్ ను శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల సదానందం, బీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కళాకారుడు బూర్గు రవి గౌడ్ మాట్లాడుతూ తనకి అవార్డు రావడం సంతోషంగాఉందని,అవార్డు అందజేసిన చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.