ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన బైరపాక ప్రభాకర్

journalist vaartha
By -
 

స్టేషన్ ఘన్ పూర్ /జనవరి18 (జర్నలిస్ట్ వార్త): 
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బైరపాక ప్రభాకర్ ఆధ్వర్యంలో  నియోజకవర్గ కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,నవరస, నటసార్వభౌమ, పద్మశ్రీ,  స్వర్గీయ నందమూరి తారక రామారావు  30వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రభుత్వ హాస్పటల్లో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైరపాక ప్రభాకర్ ఆధ్వర్యంలో పేషెం ట్లకు పండ్లు పంపిణీ  చేయడం జరిగింది.ఈ సంద ర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశంపార్టీని స్థాపించి చదువు కున్న పేదలను నాయకులుగా చేయడం జరిగింద ని, అంతేకాకుండా పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు పక్క ఇండ్లు,ప్రతి గ్రామాని కి సీసీరోడ్లు, నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి స్కూల్ భవనాలు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహిళల ను ఐక్యత చేసి మహిళా సంఘాలు స్థాపించి, మహి ళలకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారని, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మహిళలు రాజకీ యాల్లో రావాలని మహిళలను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకా లు నిర్వహించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని ఇప్పుడు న్న ప్రభుత్వంలో, అన్నిపార్టీలనాయకులలో ఎక్కు వమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే అందుకని ఆ మహానుభావుని వర్ధంతి  సందర్భం గా ఆ మహానుభావునిస్మృతికి వినమ్ర నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బత్తిని ఎల్లయ్య గౌడ్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు సంజీవ, వెంకటేష్, స్టేషన్ గన్పూర్ మండల కమి టీ నాయకులు, రవి, బిక్షపతి,గ్రామకమిటీ నాయ కులు అశోక్,చిన్న పెండ్యాల గ్రామ శాఖ  అధ్యక్షు డు శ్రీనివాస్, కుమారస్వామి, సిద్ది రాములు తదితరులు పాల్గొన్నారు.