తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అధ్యక్షులు ఈగ మల్లేశం

journalist vaartha
By -




 వరంగల్/జనవరి18,(జర్నలిస్ట్ వార్త);నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా,ఆల్ ఇండియా ఎన్టీఆర్ అభిమాన సంఘం జాతీయ గౌరవ అధ్యక్షులు ఈగ మల్లేశం అన్నారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు,పేదల పెన్నిధి , బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా
హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి ఈగ మల్లేశం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఈగ మల్లేశం మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పేదలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం  లభించాయన్నారు. ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ వెనుకబడిన వర్గాల వారికి రాజకీయాలలో అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడని ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక చరిత్ర అయితే , తన పాలన దక్షతతో  అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి పేదల దేవుడుగా ఎన్టీఆర్ కీర్తించబడ్డాడన్నారు.  రెండు రూపాయలకు కిలో బియ్యం , మండల వ్యవస్థ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు  ఆడపిల్లకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని తీసుకురావడం లాంటి పథకాలు నేటికీ కొనసాగుతూ ఉన్నాయంటే అదే ఎన్టీఆర్ గొప్పతనం ఈగ మల్లేశం అన్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా టిఆర్ఎస్ అధినేత,తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసిఆర్ కు  ఎన్టీఆర్ యొక్క జయంతి, వర్ధంతిని అధికారికంగా జరపమని విన్నవించుకున్నానని, పలుసార్లు కలిసి మెమొరండం ఇవ్వడం కూడా జరిగింది.అయినా వారు పట్టించుకోలేదు.ఎన్టీఆర్ అనేవాడు అందరివాడు. ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో సంబంధించిన వ్యక్తి కాదు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ అందరి హృదయాలలో నిండుగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ప్రజా పాలనతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం చారిత్రాతకమైనటువంటి నిర్ణయాన్ని వరంగల్ జిల్లాలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించడం దీన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని,చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా ఇది ఉంటుందని వారికి విన్నవించుకుంటున్నా అన్నారు. అదే విధంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చొరవతో ఎన్టీఆర్ జయంతి వర్ధంతిని అధికారికంగా చేపట్టే విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుల్లూరు అశోక్ కుమార్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ వెలగందల రవీందర్ గుప్తా, పోతరాజు అనిల్ కుమార్, కందుకూరి నరేష్, కొంగర ప్రభాకర్, అనిశెట్టి సతీష్, కమ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ప్రసాదు  మహేందర్ తదితరులు పాల్గొన్నారు.