స్టేషన్ ఘన్ పూర్/జనవరి18 (జర్నలిస్ట్ వార్త) :
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దొంత బిక్షపతి ఇటీవల మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ముక్కెర స్వరూప రవి యాదవ్ ఆదివారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మృతుడి కుటుంబా నికి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఉపసర్పంచ్ గోవిందు ఇసాక్,వార్డుసభ్యు లు మిర్జా అబ్సల్ బేగ్, మారబోయిన రాజయ్య,, మెర్గ్ రాజయ్య,మాజీఎంపీటీసీలు బెల్లపు వెంకట స్వామి, పులిగిల్ల పార్వతి గట్టయ్య, మాజీ సర్పం చ్ బూరు నరేందర్,వెంకటేశ్, ముక్కెర కుమార స్వామి, గోవింద్ జంపి, మారబోయిన రమేష్, బుచ్చిమల్లు తదితరులు పాల్గొన్నారు.