వరంగల్ /డిసెంబర్ 9 (జర్నలిస్ట్ వార్త):
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–14 రబ్బీ ఎంపిక పోటీలు నర్సంపేట మినీ స్టేడియంలో జరిగాయి. ఈ పోటీల్లో మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలె బాలుర పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
పోటీల్లో పాఠశాల నుంచి పాల్గొన్న ఐదుగురు క్రీడాకారుల్లో ఎ. చరణ్ తేజ్, యం. పవన్ (తొమ్మిదవ తరగతి), రిషిత్ (ఎనిమిదవ తరగతి) ఉత్తమ ప్రదర్శనతో ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 23, 24 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి రబ్బీ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను జిల్లా క్రీడల అధికారి రాజ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరునగిరి శ్రీలత, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయుడు సందీప్ అభినందించారు