నెక్కిండ/జనవరి 22 (జర్నలిస్ట్ వార్త): నెక్కిండ మండలం తోపనపెల్లి గ్రామానికి చెందిన బిక్షం పదవ రోజు కార్యక్రమానికి వర్ధన్నపేట వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా బిక్షం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం బిక్షం కుమారుడు బొల్లపెల్లి సురేష్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎం.డి. అక్బర్, వార్డు సభ్యులు ఎం.డి. రషీద్, ఎలికట్టె చిన్న రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికయాల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకుడు రాసురి శారద లింగం తదితరులు పాల్గొన్నారు.