రిజర్వేషన్లపై మున్సిపాలిటీలో చర్చబీసీ–ఓసీ వర్గాలకు అన్యాయం జరిగిందంటూ గుసగుసలు

journalist vaartha
By -


వర్ధన్నపేట / జనవరి 18 (జర్నలిస్ట్ వార్త):
మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులపై వర్ధన్నపేటలో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపాలిటీ ఎన్నికల వరకూ బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదన్న భావన బలపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ నిర్ణయాలు తమకు అన్యాయంగా మారాయని బీసీ, ఓసీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
డివిజన్ల వారీగా ఓటర్ల వివరాలు
1వ డివిజన్ – 731 ఓట్లు (ఎస్సీ జనరల్)
2వ వార్డు – 857 ఓట్లు (ఎస్టీ మహిళ)
3వ డివిజన్ – 93 ఓట్లు (ఆల్ జనరల్)
4వ డివిజన్ – 1004 ఓట్లు (జనరల్ మహిళ)
5వ డివిజన్ – 1048 ఓట్లు (జనరల్ మహిళ)
6వ డివిజన్ – 975 ఓట్లు (ఆల్ జనరల్)
7వ డివిజన్ – 897 ఓట్లు (ఎస్టీ జనరల్)
8వ డివిజన్ – 819 ఓట్లు (ఎస్టీ జనరల్)
9వ డివిజన్ – 894 ఓట్లు (జనరల్ మహిళ)
10వ డివిజన్ – 801 ఓట్లు (జనరల్ మహిళ)
11వ డివిజన్ – 666 ఓట్లు (బీసీ జనరల్)
12వ డివిజన్ – 931 ఓట్లు (ఎస్సీ మహిళ)
మొత్తం ఓటర్లు: 10,523
ఎస్సీ రిజర్వేషన్ విశ్లేషణ
ఎస్సీ రిజర్వేషన్ కింద
1వ డివిజన్ – ఎస్సీ జనరల్
12వ డివిజన్ – ఎస్సీ మహిళగా కేటాయించారు.
అయితే ఎస్సీ జనాభా అధికంగా ఉన్న 3వ, 10వ డివిజన్లను జనరల్ కేటగిరీకి కేటాయించడం గమనార్హం. ఈ రెండు వార్డుల్లో ఎస్సీలు బలంగా పోటీ చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎస్టీ రిజర్వేషన్ పరిస్థితి
2వ వార్డు – ఎస్టీ మహిళ
7వ వార్డు – ఎస్టీ జనరల్
8వ వార్డు – ఎస్టీ జనరల్
ఇక జనరల్‌గా కేటాయించిన 4, 5, 6 వార్డుల్లోనూ ఎస్టీ జనాభానే అధికంగా ఉండటంతో, అక్కడ కూడా ఎస్టీలే పూర్తి స్థాయిలో పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఆరు వార్డుల్లో ఎస్టీలు బలమైన అభ్యర్థులుగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్
11వ వార్డును బీసీ జనరల్‌కు కేటాయించారు. ఈ వార్డులో అన్ని వర్గాల జనాభా ఉన్నప్పటికీ, బీసీలు పోటీ చేసే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. చైర్మన్ పదవిపై ప్రభావం చూపే కీలక డివిజన్‌గా 11వ వార్డు మారే అవకాశం ఉందని విశ్లేషణ.
జనరల్ కేటగిరీపై అసంతృప్తి
జనరల్ కేటగిరీలో ఉన్న
3, 4, 5, 6, 9, 10 వార్డుల్లో
ఎక్కువగా ఎస్సీ–ఎస్టీ జనాభా ఉన్నప్పటికీ, ఓసీ వర్గాలకు వాస్తవిక అవకాశాలు లేకుండా పోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బీసీ, ఓసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
చైర్మన్ పదవిపై అంచనాలు
గతంలో మహిళ చైర్మన్ ఉండటంతో ఈసారి పురుషుడికే చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. గతంలో ఎస్టీలు చైర్మన్ పదవి అనుభవించగా, ఈసారి ఎస్సీలకు అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం స్థానాల పరంగా చూస్తే, పది స్థానాల్లో ఎస్సీ–ఎస్టీలే ఆధిపత్యంగా కనిపిస్తున్నారు.
మొత్తం మీద
కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలైన రిజర్వేషన్ విధానం బీసీ వర్గాలతో పాటు ఓసీల్లోని అగ్రవర్ణ కులాలకు తీవ్ర అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఈ అంశం మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని చర్చ జరుగుతోంది.