డి అడిక్షన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీ.ఎస్.ఆర్

journalist vaartha
By -



 
భూపాలపల్లి/జనవరి17 
(జర్నలిస్ట్ వార్త);
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజు నగర్ లో శనివారం సంఘమిత్ర వాలంటరీ ఆర్గనైజేషన్ నేతృత్వంలో డాక్టర్ అరికిల్ల మనోహర్ శైలజ ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన  డి అడిక్షన్ (మాదకద్రవ్యములో మద్యపాన వ్యసన విముక్తి) కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు మద్యపానానికి , మత్తుకు బానిసలు కావద్దని మత్తు జీవితాలను చిన్న భిన్నం చేస్తుందని తెలిపారు. అలాంటివారు ఈ డి అడిక్షన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తమ వ్యసనాలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రాజబాపు , డిసిసి అధ్యక్షులు బట్టు కరుణాకర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమురయ్య, స్థానిక నాయకులు అప్పం కిషన్, రామ్ నేను రవీందర్ తోట రంజిత్ , సంఘమిత్ర వాలంటరీ ఆర్గనైజేషన్ సంస్థ మేనేజర్ సుంకరి సునీల్, డాక్టర్ టి వినోద్, డాక్టర్ అక్షయ్, కోఆర్డినేటర్స్ డి రాజయ్య, రమేష్, సైకాలజిస్ట్ నాగరాజు  తదితరులు పాల్గొన్నారు.