మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలికేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

journalist vaartha
By -


 వర్ధన్నపేట/ జనవరి 18(జర్నలిస్ట్ వార్త):మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మల్లికార్జున స్వామి వారిని వేడుకున్నట్లు కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్  ఈగ మల్లేశం తెలిపారు. ఆదివారం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్  ఈగ మల్లేశం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.అనంతరం ఈగ మల్లేశం కు శాలువా కప్పి సన్మానం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.