ధర్మసాగర్,/హనుమకొండ బ్యూరో మార్చి 8 (జర్నలిస్ట్ వార్త): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా పోలీసు సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రావు మహిళా సిబ్బందికి శాలువాలు కప్పి సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘమని అన్నారు. కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు విద్య, వైద్యం, పరిపాలన, సాంకేతిక రంగాలతో పాటు పోలీస్ శాఖలో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను నిరూపిస్తున్నారని అన్నారు.పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ధైర్యం, నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల భద్రతకు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు ఎదురైనా మహిళలు ధైర్యంగా ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళల కృషి, అంకితభావం వల్లే పోలీస్ శాఖ ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పొందుతోందని అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల సాధికారత, సమానత్వం, గౌరవాన్ని గుర్తు చేసే ప్రత్యేక రోజు అని పేర్కొంటూ మహిళలు తమ హక్కులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఈ. నరసింహరావు, ఎస్‌ఐ దిలీప్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
మహిళా పోలీసులకు ఘన సత్కారంఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
By -
March 08, 2026