మహిళా దినోత్సవం ఘనంగా ధర్మసాగర్ లో

journalist vaartha
By -
ధర్మసాగర్,/హనుమకొండ బ్యూరో మార్చి 8 (జర్నలిస్ట్ వార్త):హనుమకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డాక్టర్ కూరపాటి రమేష్, కూరపాటి రాధిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజ పురోగతిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. కుటుంబాన్ని ముందుకు నడిపించే శక్తి మహిళలదేనని, సమాజ నిర్మాణంలో వారు కీలక స్థంభాలుగా నిలుస్తున్నారని అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయాలు, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.మహిళల సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ప్రజాప్రతినిధులు, యువత, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు అభినందనలు తెలుపుతూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.