వరంగల్/ మే 29(జర్నలిస్ట్ వార్త): వరంగల్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 2026-28 సంవత్సరానికి సంబంధించిన నూతన అక్రిడిటేషన్ కార్డులను కలెక్టర్ చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ సభ్యులు కోదాటి గోపాలకృష్ణ, ఇతర ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారదా దేవి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొనియాడారు. బాధ్యతాయుతమైన జర్నలిజంతో జిల్లా అభివృద్ధికి మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు. సకాలంలో అక్రిడిటేషన్ కార్డులు అందజేసినందుకు కమిటీ సభ్యులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
కలెక్టర్ చేతులమీదుగా అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ
By -
May 29, 2026