ఆలేరు/మే 29(జర్నలిస్ట్ వార్త): పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గో టు విలేజ్ - మాదిగ పల్లెలకు తరలండి 40 రోజుల కార్యాచరణను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో మండల అధ్యక్షుడు కందుల నరసింగరావు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 30 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ఫలాలను జాతి బిడ్డలకు చేరవేయడానికి, యువతను చైతన్యపరచడానికి ఈనెల 25 నుండి జూలై 5 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో నూతన కమిటీలు, గద్దెల నిర్మాణం చేపట్టి జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా శారాజిపేట గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా ఆడపు కరుణాకర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడిగా కళ్లెం సాయికుమార్ మాదిగ, విహెచ్పిఎస్ అధ్యక్షుడిగా పుట్టల దేవేందర్ మాదిగలతో పాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్ల చంద్రస్వామి మాదిగ, ఇతర అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాదిగ పల్లెలకు తరలండిబిర్రు మహేందర్ మాదిగ
By -
May 29, 2026