వర్ధన్నపేట/మే 26(జర్నలిస్ట్ వార్త): వరంగల్ నుంచి వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి వయా పంతిని మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసును అధికారులు పునరుద్ధరించారు. కరోనా సమయంలో ఈ బస్సును బొల్లికుంట మీదుగా మళ్లించగా, ఇటీవల అక్కడ సీసీ రోడ్డు పనుల వల్ల సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు మండల కేంద్రానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్తుల సమస్యలపై ఎమ్మార్పీఎస్, ఎమ్ఎస్పీ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో వరంగల్ ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీఎం. వయా పంతిని మీదుగా లోకల్ బస్సును పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బస్సు రాకపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేయగా, స్పందించిన ఆర్టీసీ అధికారులకు బిర్రు మహేందర్ మాదిగ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నల్లబెల్లికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ
By -
May 26, 2026