కనులపండువగా మాసాని ఆదిత్య శారీ ఫంక్షన్‌హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ

journalist vaartha
By -

పర్వతగిరి/మే8(జర్నలిస్ట్ వార్త): పర్వతగిరి మండల పరిధిలోని ఏనుగల్లు గ్రామంలో శుక్రవారం సందడి నెలకొంది. మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా నాయకులు బిర్రు నర్సులయ్య మనవరాలు, మాసాని భాస్కర్-రాధిక దంపతుల ఏకైక కుమార్తె ఆదిత్య శారీ ఫంక్షన్ (ఓణిల పండుగ) వేడుక అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగింది. ఈ వేడుకకు దళిత రత్న అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో బంధుత్వాలను, స్నేహ సంబంధాలను బలోపేతం చేసే ఇలాంటి శుభకార్యాలు ఆనందదాయకమని, సామాజిక ఐక్యతకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.అనంతరం బిర్రు నర్సులయ్య మాట్లాడుతూ తమ కుటుంబ వేడుకకు విచ్చేసిన బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబాల్లో ప్రేమానురాగాలను పంచుకుంటూ, బంధాలను గౌరవిస్తూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ వేడుకలో వరంగల్ జిల్లా జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు బిర్రు కరుణాకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, నల్లబెల్లి వార్డు సభ్యులు గోలి సుధాకర్, కాంగ్రెస్ నాయకులు మరుపట్ల ప్రశాంత్ పాల్గొని చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.