వినీత కుమారుని ఆశీర్వదించిన మహేందర్ మాదిగ

journalist vaartha
By -
వర్ధన్నపేట/జూన్7(జర్నలిస్ట్ వార్త); మండల పరిధిలోని నల్లబెల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన బిర్రు యాదగిరి కుమార్తె వినీత కుమారుడి 21వ రోజు (బారసాల) కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్, ఎమ్ఎస్పీ రాష్ట్ర నాయకులు, దళిత రత్న అవార్డు గ్రహీత బిర్రు మహేందర్ మాదిగ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి బాలుడిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట ఆటో యూనియన్ నాయకులు బిర్రు రాజయ్య, కార్మిక సంఘం నాయకులు బిర్రు స్వామి, టాటా ఏసీ ఆటో డ్రైవర్ యూనియన్ సంఘం నాయకులు బిర్రు స్వామి తదితరులు పాల్గొన్నారు