పోలియో చుక్కలు వేసిన ఎస్సై వంశీకృష్ణ

journalist vaartha
By -

సంగెం/ జూన్ 28 (జర్నలిస్ట్ వార్త): జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సంగెం మండలంలో ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో ఎస్సై వంశీకృష్ణ పాల్గొన్నారు. చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.