ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలువేలేరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ మీ బిల్లా యాదగిరి

journalist vaartha
By -

వేలేరు/హనుమకొండ, జూన్ 28 (జర్నలిస్ట్ వార్త):
వేలేరు మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల సర్పంచుల వేదిక అధ్యక్షుడు, వేలేరు ప్రధాన గ్రామపంచాయతీ సర్పంచ్ మీ బిల్లా యాదగిరి ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, తెలంగాణను పూర్తిస్థాయిలో పోలియో రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం, అంబేద్కర్ కూడలిలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది అందుబాటులో ఉండి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. ప్రతి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వైద్యాధికారి డాక్టర్ మేఘన, ఆరోగ్య పర్యవేక్షకుడు వెంకటేశ్వర్లు, సహాయ నర్సు కనకమ్మ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయినులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.