ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో జూన్ 28 (జర్నలిస్ట్ వార్త): ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ధర్మసాగర్ మండల అభివృద్ధి అధికారి అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని ఏలుకుర్తి గ్రామంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరిశెట్టి సుధాకర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు కొలిపాక కొమురయ్య, కారోబార్ బుచ్చిమల్లు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకురాలు నరిశెట్టి కవిత, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మినుముల సురేష్, మాదాసి యాదగిరి, కోటేశ్వర్, విజేందర్, సంద్ర శేఖర్, ఏఎన్ఎం అంజమ్మ, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు కొలిపాక మమత, ఆశా కార్యకర్తలు కొలిపాక మంజుల, జోగు సుమలతతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారులు తల్లిదండ్రులకు సూచించారు.
ఏలుకుర్తిలో పల్స్ పోలియోకు శ్రీకారంచిన్నారులకు చుక్కలు వేసిన ఎంపీడీవో అనిల్‌కుమార్
By -
June 28, 2026