క్యాన్సర్ బాధితుడికి సర్పంచ్ చేయూతరూ.5 వేల నగదు, క్వింటాల్ బియ్యం అందజేత.. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి

journalist vaartha
By -
ధర్మసాగర్ /హనుమకొండ బ్యూరోజూలై 19: (జర్నలిస్ట్ వార్త);ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతున్న నిరుపేద కుటుంబానికి దేవునూరు గ్రామ సర్పంచ్ హింగే రవీందర్ అండగా నిలిచారు. గ్రామానికి చెందిన బోడికల రాజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సర్పంచ్ ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుడి వైద్య చికిత్స కోసం తన వ్యక్తిగతంగా రూ.5 వేల నగదు అందజేయడంతో పాటు ఒక క్వింటాల్ బియ్యాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ హింగే రవీందర్ మాట్లాడుతూ, బోడికల రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన మేరకు తన వంతు సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అలాగే సమాజంలోని దాతలు, సేవాభావం కలిగిన ప్రజలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత అందించి చికిత్సకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.సర్పంచ్ చేసిన ఈ సహాయాన్ని గ్రామస్థులు అభినందిస్తూ, ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.