ప్రభుత్వ సీలింగ్ భూమిలో అక్రమ నిర్మాణాల తొలగింపురెవెన్యూ ఆదేశాలతో దేవునూరులో చర్యలు

journalist vaartha
By -

ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, జూలై 18: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూరు గ్రామంలో సర్వే నంబర్ 536లో ఉన్న ప్రభుత్వ సీలింగ్ భూమిని బీరప్ప గుడి పేరుతో కొందరు ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు తొలగించారు.శనివారం గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) శంకర్, సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో గ్రామ సిబ్బందితో అక్రమంగా ఏర్పాటు చేసిన కనీలు తొలగించారు. ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణలను సహించబోమని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.