బీఆర్‌ఎస్, బీజేపీ, సర్పంచుల నిరసనమండల సర్వసభ సమావేశం బహిష్కరణ

journalist vaartha
By -
వర్ధన్నపేట/జూలై 30(జర్నలిస్ట్ వార్త);: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల సర్వసభ సమావేశాన్ని బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, పలువురు సర్పంచులు గురువారం బహిష్కరించారు. తమ గ్రామాలపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సవతి తల్లి ప్రేమ చూపిస్తూ వివక్షకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, అన్ని గ్రామాలకు సమానంగా నిధులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.