సర్వసభ బహిష్కరణ రాజకీయమే వెంకటయ్య

journalist vaartha
By -
వర్ధన్నపేట/జూలై 30(జర్నలిస్ట్ వార్త): మండల సర్వసభ సమావేశాన్ని బీఆర్ఎస్, బీజేపీ సర్పంచులు బహిష్కరించడం రాజకీయ ఉద్దేశంతో చేసిన చర్యేనని మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య విమర్శించారు. ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొని గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిపోయి బయటకు వెళ్లడం సరికాదన్నారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇల్లంద ముంపు సమస్యపై గ్రామసభ నిర్వహించి, వార్డు సభ్యుల తీర్మానం ఆధారంగా చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత కావాలని ఆయన అన్నారు.