వర్ధన్నపేట/ఆగస్టు 30(జర్నలిస్ట్ వార్త): ఇల్లంద గ్రామంలో పాలకేంద్రం నుంచి గాంధీకాలనీ మీదుగా ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ పనులను వెంటనే నిలిపివేయాలని గ్రామస్థులు కోరారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గంలో లైన్ ఏర్పాటు చేయాలని వర్ధన్నపేట విద్యుత్ శాఖ ఏఈ తరుణ్‌కు వార్డు సభ్యులు బాషబోయిన ప్రవీణ్, చీపురు వెంకటస్వామి ఎలిశాల రాజేష్, పోశాల సురేష్, మునుకుంట్ల సూరయ్య, భిక్షపతి లు వినతిపత్రం అందజేశారు.
ఇళ్ల మధ్య 11 కేవీ లైన్ వద్దుపనులు నిలిపివేయాలని ఏఈకి వినతి
By -
August 30, 2026