బయ్యారం/ఆగస్టు 8.(జర్నలిస్ట్ వార్త);
బయ్యారం మండల మాజీ ఎంపిపి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గుగులోత్ కిషన్ నాయక్ జన్మదిన వేడుకలను శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ కు పార్టీ నాయకులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కిషన్ నాయక్ నిత్యం ప్రజలతో మమేకమై ఉంటూ,వారి సమస్యలను తన సమస్యలుగా భావించి ప్రజల కోసం ముందుండే నాయకుడని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ రాజకీయ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ తనపై అభిమానంతో జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానం,నమ్మకం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు.సర్పంచ్ శాంతి, పేద్దినేని వెంకటేశ్వరరావు,శాంత,తదితరులు పాల్గొన్నారు.