ల్యాబర్తి, రామోజీ కుమ్మరిగూడెం తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీలు

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఆగస్టు5(జర్నలిస్ట్ వార్త);
 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం, ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు వర్ధన్నపేట మండలంలోని ల్యాబర్తి, రామోజీ కుమ్మరిగూడెం తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎంపిక చేశారు. మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ల్యాబర్తి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొయ్యేటి వెంకన్న, రామోజీ కుమ్మరిగూడెం తండా అధ్యక్షుడిగా ఉప్పునూతుల రాములు ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడీ రాజ్‌రెడ్డి, ఐనవోలు టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రతి బాణుప్రసాద్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దామెర ప్రశాంత్, సర్పంచ్ భూక్యా సుశీల తదితరులు పాల్గొన్నారు.