ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో ఆగస్టు 5 (జర్నలిస్ట్ వార్త): భవన నిర్మాణ రంగ కార్మికులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సంక్షేమం ఇప్పటికీ నిర్లక్ష్యానికే గురవుతోందని బీఎన్‌ఆర్‌కేఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి గ్రామంలో బుధవారం బీఎన్‌ఆర్‌కేఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ శాఖ అధ్యక్షుడు కొల్లిపాక స్వామి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణతో నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల కోసం సమగ్ర సంక్షేమ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన లేదా గాయపడిన కార్మిక కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం, సామాజిక భద్రత, ఆరోగ్య సదుపాయాలు, పిల్లల విద్యకు ప్రత్యేక పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టంలో ఉన్న అనేక సంక్షేమ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం వల్ల వేలాది కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ నరిసేటి సుధాకర్ స్థలం కేటాయిస్తానని హామీ ఇవ్వగా, కాంట్రాక్టర్ మండ మల్లికార్జున్ 200 సిమెంట్ బస్తాలు అందజేస్తానని ప్రకటించారు. ఈ సహకారానికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జోగు సాంబయ్య, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి భాష పోయిన కుమార్, సహాయ కార్యదర్శి కే. రాజు, కొల్లిపాక ప్రభుదాస్, ఉప సర్పంచ్ కొల్లిపాక రమేష్, కార్మిక నాయకులు, వార్డు సభ్యులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలిఎల్కుర్తి లో బీఎన్‌ఆర్‌కేఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తి
By -
August 04, 2026