వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం

journalist vaartha
By -
దామరచర్ల /ఆగస్టు 4 (జర్నలిస్ట్ వార్త): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ జలసిరి, జల్ సంచాయ్–జన్ భాగిదారి (JSJB), జల శక్తి అభియాన్, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాల్లో భాగంగా దామరచర్ల మండలంలోని రాళ్లపాడు తండ గ్రామపంచాయతీ పరిధిలో కమ్యూనిటీ సోక్‌పిట్ (ఇంకుడు గుంతలు) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులు సర్పంచ్ ధీరావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సర్పంచ్ ఆదేశాల మేరకు స్థానిక 1వ వార్డు సభ్యుడు ధీరావత్ కోట నాయక్, 7వ వార్డు సభ్యుడు రేవంత్ రెడ్డి (వంశీనాయక్), సర్పంచ్ కుమారుడు శ్రీధర్ నాయక్ పనులను పరిశీలించి, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వారు తెలిపారు.