భూనిర్వాసిత రైతుల ధర్నా

journalist vaartha
By -
దామరచర్ల/ ఆగస్టు 3(జర్నలిస్ట్ వార్త): దామరచర్లలోని వైటీపీఎస్ విద్యుత్ కేంద్రం ప్రధాన ద్వారం ఎదుట భూనిర్వాసిత రైతులు సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. పవర్ ప్లాంట్ కోసం భూములు తీసుకున్న సమయంలో కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టి భూనిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. ధర్నా సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.