ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో ఆగస్టు 18 (జర్నలిస్ట్ వార్త);హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలోని ఊరచెరువు వద్ద మంగళవారం ఉదయం దారుణ హత్య వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని గొంతు కోసి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఘటన స్థలంలో కనిపించిన ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. ఈ ఘటనతో రాంపూర్ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.మృతుడిని జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన పోలు వెంకటేశ్వర్లు (45)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న ధర్మసాగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
రాంపూర్‌లో దారుణ హత్యగొంతు కోసి, కత్తితో పొడిచి హతమార్చిన దుండగులు
By -
August 17, 2026