రైతుల కోసం.. నక్కల తూము గేట్లు ఎత్తిన కడియంసాగునీటి కష్టాలకు చెక్‌.. యాసంగి నాటికి కాలువల అభివృద్ధి: కడియం

journalist vaartha
By -
ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, ఆగస్టు 19 (జర్నలిస్ట్ వార్త): రైతుల సాగునీటి కష్టాలపై మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ధర్మసాగర్ రిజర్వాయర్‌లోని నక్కల తూము గేట్లను బుధవారం ఎత్తి రైతులకు సాగునీటిని విడుదల చేశారు. దీంతో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించింది.రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న కాలువల పరిధిలో వానాకాలం పంటలకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కడియం శ్రీహరి సూచించారు. యాసంగి నాటికి కాలువల అభివృద్ధికి అవసరమైన అంచనాలు సిద్ధం చేసి, పనులు చేపట్టి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. నక్కల తూము గేట్లు ఎత్తడంతో పంటలకు సాగునీటి భరోసా లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యపై స్పందించి వెంటనే నీటిని విడుదల చేయించిన కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి, ధర్మసాగర్ తహసీల్దార్ బావుసింగ్, ఎంపీడీవో అనిల్‌కుమార్, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.