పెట్రోల్‌ బంకులో చోరీ.. ముగ్గురి అరెస్టురూ.11 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం

journalist vaartha
By -
గీసుగొండ/ ఆగస్టు 20(జర్నలిస్ట్ వార్త): ఊకల్‌ శివారులోని పెట్రోల్‌ బంకులో రూ.15,800 నగదు చోరీకి పాల్పడిన కాజీపేటకు చెందిన కంది చరణ్‌, జక్కుల ప్రతాప్‌, గండికోట శివను అరెస్టు చేసినట్లు సీఐ డి. విశ్వేశ్వర్‌ తెలిపారు. ఈ నెల 18న మేనేజర్‌ నిద్రిస్తున్న సమయంలో బ్యాగులోని నగదు అపహరించినట్లు చెప్పారు. మరియాపురం శివారులో వాహన తనిఖీల్లో అనుమానాస్పద ఆటోను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ.11 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ పేర్కొన్నారు.