ఇంటి స్థలంలోకి చొరబడి దాడి.. ఒకరి అరెస్టుఆరుగురి కోసం పోలీసుల గాలింపు

journalist vaartha
By -

గీసుగొండ/ఆగస్టు 20(జర్నలిస్ట్ వార్త): ఇంటి స్థలం వివాదంలో దాడికి పాల్పడిన కేసులో గీసుగొండకు చెందిన దౌడు అనిల్‌ (45)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ డి. విశ్వేశ్వర్‌ తెలిపారు. జూన్‌ 7న దౌడు ప్రవీణ్‌, అతని అన్న ప్రమోద్‌, తండ్రి మొగిలిపై ఏడుగురు ఇంటి స్థలంలోకి చొరబడి దాడి చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలిపారు. కేసులో మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.