జెండా ఎగురవేతపై వివాదం.. మాజీ ఎమ్మెల్యేపై కేసు

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఆగస్టు 20 (జర్నలిస్ట్‌ వార్త): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా తలకిందులుగా ఎగురవేశారనే ఆరోపణలు వర్ధన్నపేటలో వివాదానికి దారితీశాయి. ఈ ఘటనపై వర్ధన్నపేట మున్సిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 15న పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాను అవమానించేలా ఎగురవేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. జెండా ఎగురవేతలో పొరపాటు ఎలా జరిగింది? కార్యక్రమంలో ఎవరి పాత్ర ఉంది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.