పేద విద్యార్థినికి మాస్‌ ఆర్థికసాయం

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఆగస్టు 20(జర్నలిస్ట్ వార్త): ఇల్లంద గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని మైదం రజిత హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఫీజు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న మాస్‌ ప్రతినిధులు రూ.15 వేల సాయం అందించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ఇప్పటివరకు రూ.42 లక్షల సాయం అందించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డాక్టర్‌ శివశంకర్‌, జర్నలిస్ట్‌ వార్త న్యూస్ పేపర్ ఛైర్మెన్ బిర్రు కరుణాకర్‌, సీనియర్ జర్నలిస్ట్ జోగుల సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.