మహబూబాబాద్/ఆగస్టు 9 (జర్నలిస్ వార్త):
ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురం భీం విగ్రహానికి డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమురం భీం చేసిన పోరాటాన్ని ఆయన స్మరించుకున్నారు.గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం కొమురం భీం చేసిన పోరాటం చిరస్మరణీయమని డాక్టర్ వివేక్ అన్నారు. ‘జల్–జంగల్–జమీన్’ నినాదంతో గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. గిరిజనుల హక్కులను కాపాడటంతోపాటు విద్య, ఉపాధి, అభివృద్ధిలో సమాన అవకాశాల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గూగులోతు భీమా నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు గూగులోతు సూర్యప్రకాశ్, భూక్యా శ్రీకాంత్, జవహర్, శివవర్మ, రమేష్, దేవేందర్, నవీన్, ఎండీ సల్మాన్, గౌతమ్, నవదీప్, రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.