గుడ్‌ ఫుడ్‌ గుడ్‌ మూడ్‌’ దాబా ప్రారంభం

journalist vaartha
By -
కేసముద్రం/ ఆగస్టు 9 (జర్నలిస్ వార్త):
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని రేకులతండా వద్ద బైపాస్‌ రోడ్డుపై నూతనంగా ఏర్పాటు చేసిన ‘గుడ్‌ ఫుడ్‌ గుడ్‌ మూడ్‌’ దాబా రెస్టారెంట్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. దరంసోత్‌ సురేష్‌–స్వరూప దంపతులు ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను మాజీ కేసముద్రం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, మాజీ ఉప సర్పంచ్‌ బానోత్‌ వెంకన్న నాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రెస్టారెంట్‌ నిర్వాహకులు నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్‌ రఫీ, మార్కెట్‌ డైరెక్టర్‌ అయూబ్‌ఖాన్‌, నాయకులు యాదగిరి, భీల్య, కనుకుల రాంబాబు, బానోత్‌ మహేష్‌ రగడ, బానోత్‌ శ్రీను, తేజావత్‌ లాల్‌సింగ్‌, బానోత్‌ వీరు, తాజుద్దీన్‌, తేజావత్‌ మహేష్‌, వీరన్న, బానోత్‌ జోగ్య, బానోత్‌ భద్రం, బానోత్‌ మహేష్‌, తేజావత్‌ సురేష్‌వర్మ, బానోత్‌ కుమార్‌, నవీన్‌, బానోత్‌ రాకేష్‌, బానోత్‌ సంతోష్‌, బానోత్‌ సిద్ధు, తేజావత్‌ సుమన్‌, బానోత్‌ అఖిల్‌, తేజావత్‌ సందీప్‌, బానోత్‌ విక్రమ్‌, ఇస్లావత్‌ చంటి, తేజావత్‌ చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.