వర్ధన్నపేట/సెప్టెంబరు 16 (జర్నలిస్ట్ వార్త): జ్వరంతో చికిత్స కోసం వచ్చిన రాయపర్తి మండలానికి చెందిన పేషెంట్ వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 20 నిమిషాల పాటు వైద్యం అందలేదని బంధువులు ఆరోపించారు. కే షీట్ చేతికిచ్చి ముందుగా నంబర్ వేయించుకుని రావాలని సిబ్బంది సూచించినట్లు తెలిపారు. అనంతరం ‘పైనికి వెళ్లండి అంటూ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. రోగి వైద్యం కోసం ఎదురుచూస్తుండగా జూనియర్ వైద్యులతో మాట్లాడటం కూడా ముఖ్యమేనని ఓ వైద్యుడు చెప్పినట్లు బంధువులు ఆరోపించారు.
రోగి ఆసుపత్రికి వస్తే ముందుగా వైద్యమా.లేక ప్రక్రియలా? అన్న ప్రశ్న ఈ ఘటనతో తలెత్తుతోంది. దీనిపై ఆసుపత్రి అధికారులు స్పష్టత ఇవ్వాలని రోగి బంధువులు కోరుతున్నారు.