వేలేరు/హనుమకొండ బ్యూరోసెప్టెంబర్ 6 (జర్నలిస్ట్ వార్తవార్త):కరువు కాటుతో రైతులు అల్లాడుతున్న వేళ గోదావరి జలాలను కుంటలకు మళ్లించి రైతుల పంటలకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవ మరువలేనిదని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి అన్నారు. మిరుపకుంట, తిప్పాయికుంటలు గోదావరి జలాలతో పూర్తిస్థాయిలో నిండటంతో రైతుల తరఫున ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.సర్పంచ్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నా.. రైతుల కన్నీళ్లు తుడవాలనే సంకల్పంతో కడియం శ్రీహరి ముందడుగు వేశారని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి గోదావరి జలాలను కుంటలకు మళ్లించేందుకు ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించిన ఎమ్మెల్యేకు రైతులు అండగా నిలుస్తారని పేర్కొన్నారు.కుంటలు నిండితే రైతు పొలాల్లో పచ్చదనం.. పల్లెల్లో ఉపాధి పెరుగుతుంది. మిరుపకుంట, తిప్పాయికుంటలు నిండటంతో వందలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. అలాగే వేలేరు రెవెన్యూ పరిధిలోని చిటమట చెరువును కూడా ఏడాది లోపు నీటితో నింపేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించడం పట్ల సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు. రైతు కష్టాన్ని గుర్తించి సాగునీరు అందించిన నాయకుడికి రైతుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందని బిల్లా యాదగిరి అన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కత్తి సంపత్, ఉపసర్పంచ్ శ్రీకర్, రైతులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కరువులో రైతులకు గోదావరి జలాల వరంకడియం శ్రీహరి చొరవతో కుంటలు కళకళ.. సర్పంచ్ బిల్లా యాదగిరి
By -
September 06, 2026