పోచమ్మ తల్లికి బోనం.. సద్దాం దంపతుల ప్రత్యేక పూజలు

journalist vaartha
By -
వేలేరు/హనుమకొండ బ్యూరో సెప్టెంబరు 6 (జర్నలిస్ట్ వార్త):వేలేరు మండల కేంద్రంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ దంపతులు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోచమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ.. గ్రామ, మండల ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా ఐకమత్యంతో, ప్రశాంతంగా జీవించాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.కార్యక్రమానికి భక్తులు, ప్రజలు, పూజారులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి.