బీఆర్ఎస్‌లో చేరిన 60 మంది కార్యకర్తలుబీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్‌, జనసేన కార్యకర్తలుఅరూరి రమేష్‌ సమక్షంలో 60 మంది చేరిక

journalist vaartha
By -
 ఐనవోలు/అక్టోబర్ 11 (జర్నలిస్ట్ వార్త): ఐనవోలు మండలం నరసింహులగూడెంలో కాంగ్రెస్‌, జనసేన పార్టీలకు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు గడ్డం సాయి గౌడ్‌, జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గడ్డం శశాంక్‌ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరూరి రమేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన చేతకాక డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వర్ధన్నపేటలో ప్రజాపాలనకు బదులు పోలీసు పాలన సాగుతోందని, ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు వ్యవహారశైలితో విసిగిపోయి కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.