వైద్య చికిత్సకు రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత

journalist vaartha
By -
వర్ధన్నపేట/ అక్టోబర్‌ 11 (జర్నలిస్ట్‌ వార్త): అనారోగ్యంతో బాధపడుతున్న దేవన్నపేటకు చెందిన శ్రీపతి కొమరమ్మ వైద్య చికిత్స కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు రూ.3 లక్షల ఎల్‌ఓసీ చెక్కును అందజేశారు. హన్మకొండలోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. ఆర్థిక ఇబ్బందులతో పేదలు మెరుగైన వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ 
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అయ్యాల రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుగొండ శ్రీనివాస్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీపతి మల్లేశం, సీనియర్‌ నాయకులు చేరాలు, రవి, రమేష్‌, ఎర్ర ప్రకాష్‌, యువజన నాయకుడు ఆరేళ్లి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.